పొంగి పొర్లుతున్న కోమటిచెరువు..
జలదిగ్బంధంలో పలు కాలనీలు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి,
రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. సిద్దిపేట పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ సైతం స్తంభించింది. వర్ష బీభత్సానికి అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. సిద్దిపేట లోని కోమటి చెరువు పొంగి పొర్లుతుంది. తీవ్ర స్థాయిలో మత్తడ ప్రవాహం ఉండటంతో శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, శ్రీనివాస సగర్, సీతారామంజనేయ టాకీస్ ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. పలు వాహనాలు, అపార్టుమెంట్ లోకి నీరు నిలిచింది. ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ రహదారి బావిస్ ఖానా పూల్ నుంచి నీరు ప్రవహిస్తుండటంతో, ఆ ప్రాంతం నీటితో నిండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కలెక్టర్ ఆదేశాలతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.












