హుస్నాబాద్ పట్టణ ప్రజలకు హెచ్చరిక…. భారీ వర్షాల కారణంగా పునరావాస కేంద్రం ఏర్పాటు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, ఆగస్టు 27:
హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం పురపాలక సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉండటంతో, వారి కోసం పాత మున్సిపల్ ఆఫీసు భవనంలో తాత్కాలిక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కమిషనర్ సమాచారం ప్రకారం, ఎవరైతే ఈ పునరావాస కేంద్రంలో చేరదలిచారో వారు తమ వివరాలను కొత్త మున్సిపల్ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 7793911994 కి కూడా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ హెచ్చరించారు.
కంట్రోల్ రూమ్ నెంబర్: 7793911994





