సిద్దిపేట మున్సిపల్ ఆర్ఐ పై అనర్హత వేటు.. !
- వరంగల్ రీజనల్ డైరేక్టర్ ఆదేశాలు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, ఆగస్టు 27
సిద్దిపేట మున్సిపల్ శాఖ లో యూడీ ఆర్ఐ గా భాధ్యతలు నిర్వహిస్తున్న పి. బాలకృష్ణ పై వరంగల్ రీజనల్ డైరక్టర్ షాహిద్ మసూద్ అనర్హత వేటు వేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం సూచించిన డిపార్ట్ మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాదించకుండానే తప్పుడు పత్రాలు సమర్పించి
యూడీఆర్ఐ గా పదోన్నతి పొందారని స్పష్టం చేస్తూ జూనియర్ అసిస్టెంట్ పదవికి తిరిగి ఇస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. 2022 లో చంద్రం ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన సిడిఎంఎ ఇ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తన ఇంటిపేరును ‘గ్యాదరి బాలకృష్ణ’ నుంచి ‘పారుపల్లి బాలకృష్ణ’గా మార్చుకోవడం ద్వారా ఉద్యోగం పొందారని ఇది కూడా తప్పుడు ధ్రువ పత్రాలతో ఉద్యోగం పొందారని దీనిపై సరైన ఆధారాలు ఇవ్వాలని కోరింది.. బాలకృష్ణ ఎలాంటి పత్రలు అందజేయకుండా స్పందించడం లేదని.. తప్పుడు దృవ పత్రాలతో ఉద్యోగం పొందారనట్లు రుజువైతే బాలకృష్ణ ఉద్యోగం నుంచి తొలగించబడుతారని తెలుస్తుంది.






