అసంతృప్తిలో సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు..!‌‌నిన్నమొన్న వచ్చినవారికి అదలం..మొదటి నుంచి కష్టపడ్డవారికి ఇప్పటికీ కష్టాలే..ప్రజా ప్రతినిధులుగా గెలిచినా.. సారు చెప్పుచేతలో కీలు బొమ్మలమే..

అసంతృప్తిలో సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు..!‌‌నిన్నమొన్న వచ్చినవారికి అదలం..మొదటి నుంచి కష్టపడ్డవారికి ఇప్పటికీ కష్టాలే..ప్రజా ప్రతినిధులుగా గెలిచినా.. సారు చెప్పుచేతలో కీలు బొమ్మలమే..

అసంతృప్తిలో సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు..!
‌‌నిన్నమొన్న వచ్చినవారికి అదలం..
మొదటి నుంచి కష్టపడ్డవారికి ఇప్పటికీ కష్టాలే..
ప్రజా ప్రతినిధులుగా గెలిచినా.. సారు చెప్పుచేతలో కీలు బొమ్మలమే..
కుర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి..
‌‌ఆర్థికంగా ఎదిగినోళ్లే ఎదుతున్నరు.. వెనక బడ్డవారు వెనుకే ఉన్నారు.. 
‌‌తమవంతు రాక కోసం ఎదరుచూపులు.. లక్షల్లో ఖర్చులు..
అప్పుల పాలవుతున్నామంటూ ఆవేదన.. బతికి చెడుతున్నమంటూ బాధ.. రానున్న పండుగలకు వార్డుల్లో ఖర్చుకూ కటకటే..
ఇక వచ్చే ఎన్నికల్లో నిలబడేదెలా.. నిలబడితే ఖర్చు కష్టాలు తట్టుకునేదెలా..?
ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకొని ఉంటున్నా పట్టించుకోవట్లేదని కొందరి గులాబీ లీడర్ల ఆవేదన..

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి,

సిద్దిపేటలో రాజకీయం అతీతం.. ఇక్కడ బీఆర్ఎస్ కు మంచి పట్టుంది.. రాష్ట్రంలో ప్రభుత్వం ఎదైనా.. ఇక్కడ గెలిచేది మాత్రం బీఆర్ఎస్.. కానీ ఇక్కడ రాజకీయ నేతలు పైకి మాత్రం సంతృప్తితో ఉన్నట్లు కనపడుతారు.. లోపల అంతా డొల్లే.. పైకి మాత్రం మెడిపడు.. చందంగా కనుపడుతారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కదిలించినా చెప్పే బాధ వర్ణనాతీతం.. అసంతృప్తేతే.. గత రెండు సంవత్సరాల కింద  అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల కథే… బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకేదో న్యాయం జరుగుతుందని ఆశించిన నేతలు నేటికీ బంగపాటే మిగిలింది. కీలుబొమ్మలా మారామని ఆలోచనలో పడ్డారు. ఇంకా ఎదో మ్యాజిక్ జరుగుతుందని ఏదురుచూస్తూన్నారట. పార్టీలో చక్రం తిప్పే వారు తిప్పుతూనే ఉన్నారు. కొట్లు సంపాదించుకుపన్న వారు కోట్లకు పరుగేడుతుంటే.. తమ జీవితాలు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లు ఉందట. తనవంతు కూడా రాకపోందా.. తాము చక్రం తిప్రకపోతామా అన్నట్లు ప్రభుత్వం పోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అదృష్టం కోసం ఎదురుచూస్తునే ఉన్నారట. తమ వంతు వస్తుందని చూస్తున్న నేతలు ఎదురుచూపులకే పరిమితమైయ్యామని భంగపడుతున్నారు. ముందు వరుసలో ఉన్న నేతలు కోట్లకు పడగలేత్తుతే.. వెనుకపడ్డ తాము వేనుకే ఉన్నామని గమనించే సరికి పుణ్యకాలం కాస్త పూర్తయిందని గమనించలేకపోయారట. ఇంక ఏదో మ్యాజిక్ జరగక పోతుందా..  తమవంతు రాక పోతుందా అని ఎదుచూస్తునే ఉన్నారు. లక్షల రూపాయలు అప్పు చేసి ఖర్చు చేసి రాజకీయ నేతలుగా గెలిచామన్న సంతృప్తి లేకుండా పోయిందని, ప్రజా సేవలో సైతం అసంతృప్తే మిగిలిందని., ప్రజలకు అందుబాటులో ఉన్న సరైన న్యాయం చేయ్యలేకపోయామనే ఆలోచనలో పడ్డారు. ‘సిద్దిపేటలో కౌన్సిలర్లు తామేందుకు గెలిచాం.. అసలు ఏంచేశాం.. ఏం సంపాదించాం.. ఎందుకు కౌన్సిలర్లు అయ్యం’ అని ఆలోచిస్తున్నారట.. ఇద్దరు, ముగ్గురు తప్ప సంతృప్తిగా ఎవరూ లేరు. చివరకు అప్పుల పాలయ్యామని, అప్పులే అమిగిలాయాని మదన పడుతున్నారు.


ఏం చేయలేకపోయం..
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఏం తక్కువ.. పార్టీ అధికారంలో ఉంది.. మంచికో, చేడుకో ఆసర అవుతుందని ఆశించిన నేతలకు.. ‘మీకు నేనున్నా.. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటా’ అంటూ సారు హామీలు ఇవ్వటం.. అక్కడికే సంతృప్తి పడటం వరకు సరిపోయిందట.. చేసింది ఏంలేదు.. కడుపులో పెట్టుకుని చూసుకుంది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి మాత్రం ‘మేం గులాబీ సైనికులం’ అంటూ రొమ్ము విరవడం తప్ప రాజకీయంగా ఏం చేయ్యలేకపోయాం.. కీలుబొమ్మలమయ్యామని ఆలోచిస్తున్నారు.


కౌన్సిలర్లు పరిస్థితి మరి దారుణం..
గెలిచాం కానీ ఏంచేశాం.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గుర్తింపు ఉండటంలేదు. నిన్న మొన్న వచ్చిన వారిని అందలం ఏక్కుతున్నారు. మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి అప్పులు మిగిలాయి.. ఆర్థికంగా ఎదిగినవారు ఎదుగుతున్నారు. వెనుక పడ్డవారు వెనుకే ఉన్నారు.  ప్రజా ప్రతినిధులుగా గెలిచినా.. సారు చెప్పు చేతలో కీలు బొమ్మలుగా మారమని, కుర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి.. సొంత నిర్ణయాలు, స్వతంత్రం లేకుండా పోయిందని ఇప్పడు ఆలోచిస్తున్నారు. పైసలోచ్చే పనులు.. కాంట్రాక్ట్ లు వారికి నచ్చిన వారికి ఇచ్చి కనీసం కమీషన్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో చేయాల్సిన అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ లు సైతం చైర్మన్ తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చి వచ్చే కమీషన్లు సైతం వారే తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ మధ్య సిద్దిపేట లో ఆమృత్ పథకం ద్వారా 76 కోట్లతో నిర్మించిన రింగ్ మెన్ పనుల కమీషన్ సైతం ఇవ్వలేదని, ఏదో దావత్ ల పేరిట.. ఖర్చుల పేరిట ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని, ఈ కమీషన్ ఎవరి అకౌంట్ లోకి వేస్తున్నారో.. అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా అడుగుదామంటే ‘సారు’ ఏమనుకుంటారోనని,  అడగకుంటే ఇబ్బందులు తప్పడం లేదని మదనపడుతునారు. కౌన్సిలర్లు కోందరు ధైర్యం చేసి ఆడిగారని, అడిగిన వాళ్లు నోరు మెదపకుండా వారికి వారి సంబధికుల నుంచి ఒత్తిడి తెచ్చారని సమాచారం.  రాబోయే వినాయక చవితి, బతుకమ్మ, దసర పండుగలకు వార్డులో ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గెలిచి అప్పులు సంపాదించాం.. మిగిలింది అప్పులే.. ఇక మళ్లీ వచ్చే ఎన్నికల్లో  ఎలా నిలబడాలి.. నిల బడితె ఖర్చులెట్లా..’ అనే ఆలోచనలో తమకు తామే ప్రశ్నించుకుంటున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *