ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి


ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి

గౌరవెల్లి ప్రాజెక్ట్ భూసేకరణ వేగవంతం చేయాలి

హుస్నాబాద్ మున్సిపాలిటీ లో శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

హుస్నాబాద్ నియోజవర్గ & మున్సిపాలిటీ అభివృద్ధిపై  జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ నియోజవర్గ అభివృద్ధిపై హుస్నాబాద్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పెండింగ్ పనులు ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాల పై హుస్నాబాద్ మున్సిపాల్టీ కార్యాలయంలో  మంత్రి పొన్నం ప్రభాకర్ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంతానికి సాధ్యమైనంత త్వరగా నీళ్లు అందించడానికి గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి కావడానికి వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందనీ మొదటి దశలో అర్హులైన లబ్ధదారుల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుక కిరాయి విషయంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని, అవసరమైన మట్టి అనుమతుల విషయంలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు అర్హత ఉన్న లబ్ధిదారుల ఎంక్వైరీ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.   గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ గా కొనసాగుతాయని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే వారికి అందేలా  చూడాలని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్,రైతులకు రుణమాఫీ , రైతుభరోస కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు.

వన మహోత్సవం ద్వారా ప్లాంటేషన్ ప్రక్రియ వేగంగా జరగాలని అటవీ శాఖ అధికారులన ఆదేశించారు.  హుస్నాబాద్ లోని మూడు మండలాల్లో మూడు కొత్త నర్సరీలు ఏర్పాటయేలా స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని జిల్లాల్లగడ్డ లో  అర్బన్ డెవలప్మెంట్ పార్క్ కి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద ఎత్తున మొక్కల పెంపకం జరిగేలా సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.  మహా సముద్రం గండి ద్వారా ఏకో టూరిజం  ట్రెక్కింగ్ ,పాపన్న పోర్ట్ పై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ స్థలాల్లో విద్య సంస్థలకు ,ఇతర భవనాలకు అవసరమైన స్థలాలు సేకరించి ఉంచాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు విధిగా  గురుకుల పాఠశాలలు పర్యవేక్షించాలని సూచించారు . పంచాయితీ రాజ్ లో పెండింగ్ లో ఉన్న రోడ్లు ఇంజినీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు  ఎక్కడైనా అవసరమైన రోడ్ల ప్రతిపాదన పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ లో స్పోర్ట్స్ ముందుండాలని అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. హుస్నాబాద్ లో స్విమ్మింగ్ పూల్ , ఫుట్బాల్ కోర్టు  ల మంజూరు ప్రతిపాదనల పై ఆరా తీశారు.

హుస్నాబాద్ లో మున్సిపాలిటీ అభివృద్ధి పై వర్షాలు ,సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ , వార్డు ఆఫీసర్లతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ లో పెండింగ్ లో  సెంట్రల్ లైటింగ్ పనులు జాతీయ రహదారి పనులపై ,డివైడర్ మద్యలో మొక్కల పెంపకం ,రోడ్డుకు ఇరువైపుల మొక్కల పెంపకం అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని తెలిపారు. హుస్నాబాద్ లో ఉన్న ప్రతి వార్డులో శానిటేషన్ బాగుండాలని..ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్డు ఆఫీసర్లు నేరుగా వెళ్లి సమస్యలు తేలుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఆరోగ్య ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. మహిళ సంఘాలలో 15 సంవత్సరాలకి అవకాశం కల్పించి 65 సంవత్సరాల వరకు అవకాశం ఉండడంతో ప్రతి  మహిళా మహిళా సంఘంలో చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.  హుస్నాబాద్ మున్సిపాలిటీ లో 506 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ లో ఇల్లు లేని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలా చూడాలని తెలిపారు. పట్టణం కాలుష్యం లేకుండా పచ్చదనంతో ఉండాలని ప్రతి వార్డులో 500 మొక్కల చొప్పున నాటాలని హుస్నాబాద్ లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెల అవగాహన కల్పించాలనీ సూచించారు. ప్రస్తుతం మున్సిపాలిటీ లో ప్రజా ప్రతినిధులు లేనందున వార్డు ఆఫీసర్లు ప్రజా ప్రతినిదులుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడాలని తెలిపారు. వర్షాకాలంలో ఎక్కడైనా ఇళ్లలో గుంతలు ఉన్నాయో వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు.అక్కడ దోమలు నిల్వ ఉండి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారి హుస్నాబాద్ లోనే ఉంటూ కొత్తగా నిర్మించిన ప్రతి ఇంటికి ఇంటి నెంబర్ ఉండేలా చూడాలని టాక్స్ వసూలు 100 శాతం అయ్యేలా చూసుకోవాలని తెలిపారు. 100 శాతం రెవెన్యూ కలెక్షన్ చేస్తున్న అధికారులను ప్రోత్సహిస్తామని సూచించారు.


పర్యావరణాన్ని కాపాడడానికి దానిపై అవగాహన కల్పించాలని వినాయక చవితి సందర్భంగా ప్రముఖులకు మట్టి వినాయకుడు ,మారేడు మొక్క ,బట్ట సంచి పంపిణీ చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట. జిల్లాలో మూడు ఐటీఐ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నారని ఎవరైనా పదవ తరగతి,ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు ఉంటే గుర్తించి వారికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి శిక్షణ తర్వాత ఉద్యోగం కూడా వస్తుందని తెలిపారు  ఆసక్తి ఉన్నవారు సెట్విన్ శిక్షణ తీసుకోవాలని సూచించారు. టామ్ కాం కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వారు ఆర్థికంగా బాగుండేలా ఎవరైనా వెళ్లాలనుకుంటే తమ కార్యాలయాన్ని సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు.ఆర్థికంగా ఇబ్బందులు ఉండి కుట్టు మిషన్ ద్వారా ఆర్థిక వృద్ధి సాధించాలనుకునే వారికి కుట్టు మిషన్ కు ,వికలాంగులకు బండ్లు అవసరమైన వారి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ లో ప్రతి వార్డులో తను ప్రత్యక్షంగా పర్యవేక్షించి పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకుంట అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

ఈ సమీక్షా సమావేశంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి,ఆర్డీవో రామ్మూర్తి ,మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్,సింగిల్ విండో చైర్మన్ శివయ్య , ఎమ్మార్వో లు ,ఎంపిడివోలు , ఇరిగేషన్ , పంచాయతీ రాజ్,విద్యుత్ ,ఆర్ అండ్ బి,అధికారులు ,వార్డు అధికారులు , ఇతర ముఖ్య అధికారులు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *