సిద్దిపేటలో భూ పంచాయితీ..
కౌన్సిలర్ వర్సెస్ మాజీ చైర్మన్..!
సార్ వద్దకు పంచాయితీ..
అసలు ఆ స్థలం ఎవరిది..?
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; ఆగస్టు 17
ఎక్కడైనా. ఏవైనా వివాదాలు వస్తే రాజకీయ పెద్దల దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తారు.. కానీ ఇక్కడ ఆ రాజకీయ నేతల మధ్యే భూ పంచాయితీ తలెత్తింది.. ఇక ఈ పంచాయితీ ఎవరు పరిష్కరించాలి.. అందుకే సారు కల్పిచుకుని పంచాయితీ పరిష్కారానికి పూనుకున్నారట.
సిద్దిపేటలో రియల్ పంచాయితీ.. తారా స్థాయికి చేరింది.. గతంలో ఒక పార్టీలో ఉన్న నేతలు కలిసి మేలిసి రియల్ వ్యాపారం చేసిన వారే.. నేడు నువ్వేంత అంటే నువ్వేంత అనే స్థాయికి రియల్ పంచాయితీ వచ్చింది. ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్ వర్సెస్స్ మాజీ చైర్మన్ రియల్ పంచాయితీ రచ్చకేక్కింది. ఈ పంచాయితీ కాస్తా సార్ దగ్గరికి వెళ్లిందట. సారు కల్పించుకుని పంచాయితీని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినచ్లు సమాచారం.. ఆసలు పంచాయతీ.. ఆ భూమి కోసమేనట..
సిద్దిపేట పట్టణంలో సర్వేనంబర్ 1408 లో సిద్దిపేట స్థానిక కౌన్సిలర్ కు వంశపారంపర్య వారసత్వ భూమి ఉంది.. ఆభూమిలో సిద్దిపేట మాజీ చైర్మన్ వారసుడు పేరిట, ఆ చైర్మన్ కు అత్యంత సన్నిహితుడైన మరో కౌన్సిలర్ ఇరువురి పేరిట 33 గుంటల భూమి రిజిస్టేషన్ చేసుకున్నారు. ఆ భూమి తమకు చెందిందని.. కాదు కాదు తమదే నని ఆ కౌన్సిలర్ల మధ్య వివాదం కొనసాగుతుంది. చైర్మన్ వారసుడి పేరు పై సైతం భూమి ఉండటంతో ఆ కౌన్సిలర్ వర్సేస్స్ మాజీ చైర్మన్ మధ్య వార్ నడుస్తుంది. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది.. ఈ భూ వివాదానికి సంబంధించి ఆదే పార్టీకి చెందిన పలువురు నాయకులు కలిసి కొద్ది రోజుల క్రితం సిద్దిపేట పట్టణం లోని పెద్దమ్మ దేవాలయంలో పంచాయితీ సైతం జరిపినట్లు సమాచారం. ఆ పంచాయితీకి మాజీ చైర్మన్ హజరు కాకపోవడం తో ఈ వివాదం మరింత తీవ్రమైందని, నువ్వేంత అంటే నువ్వేంత అనే స్థాయికి వివాదం చేసుకుందని తెలుస్తుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానల మారడంతో పార్టీ ప్రతిష్ఠ ఎక్కడ దెబ్బతింటుందోనని, పార్టీ పరువు ప్రతిష్టలు దిగజారకుండా ఉండాలని ఈ పంచాయితీని పరిష్కరించాలని ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చేందుకు సారు సైతం రంగంలోకి దిగి ఇద్దరికి సయోద్య కుదిర్చేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం.. అయినా వివాదం ఇంకా సద్దుమనుగలేదని తెలుస్తుంది. ఈ పంచాయితీ తో బీఆర్ఎస్ నేతలు రచ్చకేక్కుతారా.. ఆ భూమి అసలు ఎవరిది.. అనే అంశం వేరు..





