రైతుల మేలు కంటే.. రాజకీయాలే ముఖ్యమా..?వరద నీటిని ఒడిసి పట్టండి..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..గోదారి నీళ్లను సముద్రంలోకి పంపుతామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..లక్షల మంది తో వచ్చి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాం..-మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు..

రైతుల మేలు కంటే.. రాజకీయాలే ముఖ్యమా..?వరద నీటిని ఒడిసి పట్టండి..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..గోదారి నీళ్లను సముద్రంలోకి పంపుతామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..లక్షల మంది తో వచ్చి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాం..-మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు..

రైతుల మేలు కంటే.. రాజకీయాలే ముఖ్యమా..?
వరద నీటిని ఒడిసి పట్టండి..
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం..
గోదారి నీళ్లను సముద్రంలోకి పంపుతామంటే బీఆర్ఎస్ ఊరుకోదు..
లక్షల మంది తో వచ్చి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తాం..
-మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు..

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి, ఆగస్టు 17
“నీళ్లు ఫుల్ గా ఉన్నాయి. కరెంటు ఫుల్ గా ఉంది. కాంగ్రెసోళ్లకు కట్క ఒత్తుడు చాతనైత లేద” ని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయకపోవడం, రైతులకు ఖరీఫ్ నీళ్లు వదలకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతులపై పగా ప్రతీకారం తీర్చుకుంటున్నది. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టును పడావు పెట్టింద”ని హరీశ్ విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62 వేల క్యూసెక్కుల వరద వస్తున్నదని, కడెం ప్రాజెక్టుకు మధ్యాహ్నం తర్వాత 1,50,000 క్యూసెక్కుల వరద, సాయంత్రం వరకు ఈ పూర్తి వరద కడెం ప్రాజెక్టు నుండి శ్రీపాద ఎల్లంపల్లి కి వస్తుందని అన్నారు. “నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా ఉంది. నంది మేడారంలో ఖటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయని ఆయన అన్నారు. వారం రోజుల కిందనే ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుపుతూ ఉత్తరం రాశానని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నపూర్ణ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. “దురదృష్టం ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నార” ని విమర్శించారు ఇది రాష్ట్ర ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సీ కి నిదర్శనమని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలయితుంటే గుడ్లప్పగించి రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి చూడడం తప్ప ఏం చేయడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు.
‘మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చెరువుల నిండలేదు. డ్యాములు ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో డ్యాములు ఖాళీగా ఉన్నాయి. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి?’అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ పైన, హరీష్ రావు పైన  కోపం ఉంటే తమకు శిక్ష వేయండి కానీ రైతులకు కాదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బురద రాజకీయాలు మాని వరద నీటిని ఒడిసి పట్టండని విజ్ఞప్తి చేశారు.


‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని నిరూపించడానికి మోటార్లను ఆన్ చేయడం లేదని విమర్శించారు.
30 టీఎంసీల మిడ్ మానేరులో ఉన్నది కేవలం పది టీఎం.సిలే.. ఎల్ఎండిలో కూడా 24 టీఎంసీల్లో కేవలం 7టీఎంసీలు మాత్రమే ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వం నడపడం చేతకావడం లేదా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఈ రిజర్వాయర్ లన్ని నింపుతే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంట పండుతుందన్నారు.
వాన కాలంలో సగం సాగు కూడా కాలేదు. నీటిని ఒడిసిపడితే యాసంగిలోనైనా పూర్తి పంట పండే అవకాశం ఉంటుందని, వెంటనే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు తేవచ్చాన్నారు. ఎల్లంపల్లిలో ఏడు మోటర్లు నడిపుతే 22,000 క్యూసెక్కులు మిడ్ మానేరుకు వస్తాయి. ఎందుకు మూడు మోటార్లే నడుపుతున్నారు? అని ప్రశ్నించారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు? అని ప్రభుత్వాన్ని హరీశ్ రావు నిలదీశారు. ఎల్లంపల్లి ఏడు మోటర్లు ప్రారంభించి రోజుకు రెండు టీఎంసీలు నీళ్లను మిడ్ మానేరుకు.. అక్కడినుండి రోజుకి ఒక టీఎంసీని అన్నపూర్ణ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలని డిమాండ్ చేశారు. ఈ యాసంగికి లక్షలాది ఎకరాలకు నీళ్లను అందించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

“కృష్ణా నదిలో హైడెల్ పవర్ ఉచితంగా ఉత్పత్తి అవుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ లో  రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతున్నది. మోటర్లు ఆన్ చేయడం చేతకాకపోతే మేమే వేలాదిమంది రైతులతో కదిలి వెళ్లి మోటార్లను ఆన్ చేస్తామ”ని హరీశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు రెండు టీఎంసీలు తెచ్చే వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
వేలాది మందిగా కదిలి వచ్చి  మోటర్లను ఆన్ చేస్తాం రైతులకు నీళ్లు అందిస్తామని అన్నారు.

యూరియా కష్టాలు..
“10 ఏళ్లలో ఎన్నడు రైతులు ఎరువు బస్తాల కోసం అరుగుల మీద పడుకోలేదు. కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. చెప్పులను లైన్లో పెట్టి అరుగుల మీద పండుకునే రోజులు వచ్చాయ” ని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ ఆన్ చేయడంలో ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
“మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు.. ఇవి ఇంట్లో ఉండే వన్ హెచ్ పీ మోటర్లు కాదుఒక మోటారు నడవాలంటే ఒక జిల్లా ప్రజలు వాడే అంత కరెంటు పడుతుంది..  ఆ మోటార్లను ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తున్నారు. అలా చేస్తే మోటార్లు  పాడైతాయి. బేరింగ్లు పోతాయి. పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మోటార్లు నడిపిస్తున్నారు.  కరెంటు పీక్ లోడు 5 గంటల తర్వాత ఉంటుంది కాబట్టి మోటార్లను ఆఫ్ చేస్తున్నారు. అలా చేసినట్లయితే మోటర్లు పాడైతాయి వేలకోట్ల నష్టం వాటిల్లుతుంద”ని ఆయన అన్నారు. ఈ విషయంపై బీహెచ్ఎల్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిందిని హరీశ్ గుర్తు చేశారు. మోటర్లు పనికిరాకుండా అయితే మళ్లీ ఆ బదనాం బీఆర్ఎస్ పార్టీ పై వేయాలని చూస్తున్నారని విమర్శించారు. చొప్పదండిలో మోటర్ ఆన్ చేయాలని రేషన్ కార్డులు పంచడానికి వచ్చిన ఉత్తంకుమార్ రెడ్డిపై జనాలు తిరగబడితే మోటర్లు ఆన్ చేసి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్ళిపోగానే మళ్లీ ఆఫ్ చేశారని అన్నారు. జిల్లా రైతులు, రాష్ట్రం రైతులు దెబ్బతింటారనే ఆవేదనతో మాట్లాడుతున్న అని చెప్పారు.

నల్గొండ లో ఇదే పరిస్థితి..
“నల్గొండలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ లో గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు కానీ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఒడిసిపట్టడం లేదు. ఏఎంఆర్పీ ప్రాజెక్ట్ కింద డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులకు నీళ్లు ఎందుకు  వదలడం లేదు. కల్వకుర్తిలో మూడు మోటర్లు నడపవలసి ఉంటే కేవలం ఒక్క మోటార్ మాత్రమే నడుపుతున్నారు. దేవాదులలో మంత్రులు వెళ్లి ఫేస్ 3 ఇనాగ్రేషన్ చేశారు. దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు.. వరంగల్ జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నార”ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం మోటార్ ఆన్ చేయకుంటే కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు నష్టం అని ఆయన అన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *