పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం.రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం.అసెంబ్లీ లో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నులు పెంపు.రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది..కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసింది..ప్రజల పై పన్నుల భారం పై మాజీ హరీష్ రావు ఫైర్..

పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం.రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం.అసెంబ్లీ లో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నులు పెంపు.రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది..కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసింది..ప్రజల పై పన్నుల భారం పై మాజీ హరీష్ రావు ఫైర్..

పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం.
రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం.
అసెంబ్లీ లో సుద్దపూస మాటలు.. వాస్తవంలో అన్ని పన్నులు పెంపు.
రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది..
కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసింది..
ప్రజల పై పన్నుల భారం పై మాజీ హరీష్ రావు ఫైర్..

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; ఆగస్టు 15

ప్రజా పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, రేవంత్ పాలన ప్రజలపై అప్పుల, పన్నుల భారం వేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో సుద్దపూస మాటలు చెప్పిన రేవంత్.. ప్రజలపై అన్ని పన్నులు పెంచుతూ ఆర్థిక బారం మోపుతూ నడ్డి విరుస్తున్నారని స్పష్టం చేశారు. రేవంత్ తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు..
ప్రజలపై అప్పుల, పన్నుల భారం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగ హరీశ్ రావు మాట్లాడుతూ..
గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ పన్నులు దించితే ప్రజలకు ఉపశమనం కల్గిస్తే.. కాంగ్రేస్ రెండేండ్ల పాలనలో ఆన్ని పన్నులు పెంచుతూ ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పుల, పన్నుల భారం తప్ప మరేది లేదన్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతూనే.. ట్రాన్స్పోర్ట్ పన్ను పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారన్నారు.


రాష్ట్రం అసలే ఆర్థిక మాంద్యంతో.. వరసగా రెండో నెల డిఫ్లేషన్ లో ఉందని.. తెలంగాణలో వరసగా ఇది కొనసాగుతుందని అన్నారు.
పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని.. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నారన్నారు. గత నెల, ఈ నెలలో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో రెండు వేల కోట్ల భారం మోపిందన్నారు. గతంలో రూ100 సర్వీస్ టాక్స్ ను రూ200 లు చేశారని, వెహికిల్ సర్వీస్ టాక్స్ రూ 400 నుంచి వన్ పర్సంటేజ్ కు పెంచారని అన్నారు. రోడ్ టాక్స్ నూ సైతం పెంచారన్నారు.
మోటార్ సైకిల్ టాక్స్ ను నాలుగైదు వేలకు పెంచారని, పోయిన నెల పెనాలిటిల పేరిట గత నెల వెయ్యి కోట్లు, ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం పెద, మధ్యతరగతి ప్రజల పై రెండు వేల కోట్ల భారం మోపారన్నారు.
గతంలో 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. గతేడాది 6900 కోట్లు మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు. పలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. బడ్జెట్ లో 8000 కోట్లు అంచనా వేశారు.. ఇదే ఎలా సాధ్యం అని ప్రశ్నించారు.

అసెంబ్లీ లో సుద్దపూస మాటలు మాట్లాడిన రేవంత్ వాస్తవంలో అన్ని పన్నుల పెంచి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ లో టాక్స్ లు రద్దు చేసి పేదలకు సాయం చేసినమన్నారు. పేదలపై ఈ పన్నుల భారాన్ని ఈ ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేశారు. మేము పన్నులు తొలగిస్తే.. మీరు పన్నులు వేస్తున్నారు.. ఇదేనా మీ కాంగ్రేస్ పాలన తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. ఆర్అండ్బి, పీఆర్ లో అన్యూటి మోడల్ లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారని స్పష్టం చేశారు.. ప్రజలపై దొడ్డి దారిన భారం వేసి ఆ అప్పులు కడతున్నారని తెలిపారు.. దీన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పండగలు వస్తె పాపం.. పండగకు ముందు వారం, పండగ తరువాత వారం ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూవు చేసిందని విమర్శించారు. మద్యం ధరలు రెండు సార్లు పెంచారన్నారు.


ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తారట, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రెపో మాపో పెంచుతారట.. ఇక పేద ప్రజల రక్తమాంసాలు పిలుస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిడిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నీ ఆర్ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లు తగ్గాయని స్పష్టం చేశారు. పెంచిన ట్యక్స్ లు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *