సిద్దిపేట మున్సిపల్ ప్రతిష్ఠ దిగజార్చే కుట్రా..?
సిద్దిపేట మున్సిపల్ కు కమిషనర్ ఉన్నారా..?
ఆయన వ్యవహర తీరుతో కౌన్సిల్ అసహనం..
నియంత వ్యవహారం.. ఆ కమిషనర్ మాకోద్దు..
కౌన్సిలర్ల ఫోన్లు ఏత్తడంలేదు.. మరి సామాన్యుల పరిస్థితి..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; ఆగస్టు 12
సిద్దిపేట మున్సిపల్ కు ఉన్న ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర జరుగుతుందా..? స్థాయి తగ్గించాలనే కుట్ర జరుగుతుందా.. ? అంటే అవుననిపిస్తుంది. అన్ని రంగాల్లో అగ్రగామిగా పేరు పొందిన సిద్దిపేట మున్సిపల్ ప్రతిష్ట దిగజార్చేందుకు కమిషనర్ కంకణం కట్టుకున్నారని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.. సిద్దిపేట మున్సిపల్ కు కమిషనర్ ఉన్నారా..? ఉంటే ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారు.. అని సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ ముక్కన వేలు వేసుకుంటుంది.. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కమిషనర్ మాకొద్దు.. ఆ కమిషనర్ ను మార్చండంటూ కౌన్సిల్ నిరసనలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో..ఆ కమిషనర్ తీరు కౌన్సిల్ సభ్యులకు అసహనం కలిగిస్తుంది.. ఆయన వ్యవహార శైలి.. తీరు అతిగా ఉందంటు కౌన్సిల్ సభ్యులను ఆందోళన కలిగిస్తుందంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కౌన్సిల్ సభ్యుల ఫోన్లకు రెస్పాన్స్ అవ్వడం లేదట.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి.. ప్రజలకు అందుబాటులో ఉంటారా.. స్పందిస్తారా..? కౌన్సిలర్ల ఫోన్ ఎత్తని కమిషనర్ సామాన్యుల ఫోన్ ఎత్తరని స్పష్టమవుతోంది.. ఎత్తినా సమస్యలు సానుకూలంగా వినరని.. సమాధానం కూడా అదే తీరులో ఉంటుందని తెలుస్తుంది.. ఇదంతా స్వచ్ఛ సిద్దిపేట గ్రూపులో కౌన్సిలర్లు చర్చించుకుంటున్నారు. కమిషనర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కమిషనర్ పై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ ను కలిసి విన్నవించాలన్న స్థాయికి కౌన్సిల్ సభ్యులు వచ్చారు.

సిద్దిపేట మున్సిపల్ కమీషనర్ గా భాధ్యతలు తీసుకుని పది నెలల కాలం అవుతుంది. ఆయన భాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఆయన వ్యవహర తీరు.. అతిగా ఉంటుందని.. ఆయన సామాన్య ప్రజల సమస్యలు వినే పరిస్థితిలో లేరని.. ఆయన తీరు నియంతలా ఉందంటు స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. అతను తన కార్యాలయంలో అందుబాటులో ఉండరని.. కనీసం ఫోన్ చేస్తే స్పందించరని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులే చర్చించుకుంటున్నారు. ఇక పోతే సామాన్యుల కు అందుబాటులో ఉంటారా ఆ సారు.. అస్సలు ఉండరు.. ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే కమీషనర్ ఏలా అవుతారు అంటు కౌన్సిల్ సభ్యులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ కమీషనర్ కౌన్సిల్ సభ్యులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని.. కౌన్సిల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సామాన్య ప్రజలకు ఇచ్చే మర్యాద చెప్పనవసరం లేదనుకుంటా.. ఇదంతా ఇలా ఉంటే మున్సిపల్ పలు విభాగాల్లో సమస్యలు పరిష్కరించాల్సిన కమీషనర్ పట్టించుకోవడం లేదని.. అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు సైతం నేరుగా వినపడుతున్నాయి. ఈ మధ్య ఆ కమీషనర్ అవినీతి తిమింగలం అంటు ప్రెస్ మీట్ పెట్టి సైతం విమర్శించారు. అయినా ఆ కమిషనర్ పై ఉన్నతాధికారుల నియంత్రణ లేకుండా పోయిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఆ కమీషనర్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనని చెప్పుకుంటున్నారట.. ఇదే కారణం కాబోలు ఆయన వ్యవహార తీరుకు అద్దం పడుతుంది.. సీఎం సన్నిహితుడనని నియంతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి.. సిద్దిపేట పట్టణంలో హరితహారంలో నాటిన చెట్లను నరికివేస్తున్న ఎలాంటి చర్యలు లేవు.. మున్సిపల్ లో నూతన నిర్మాణలు సైతం అనుమతులకు విరుద్దంగా.. సెట్ బ్యాంక్ లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి.. వీటి పై నియంత్రణ కరువైంది. ఇష్టరాజ్యంగా నిర్మాణాలు సాగుతున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇతంతు మామూళ్ల మత్తులో కొనసాగుతున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. ఏది ఎమైనా నంబర్ వన్ సిద్దిపేట మున్సిపల్ ను భ్రష్టు పట్టించాలని ఆయన కంకణం కట్టుకున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. సిద్దిపేట స్థాయిని దిగజార్చేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆ కమిషనర్ ను నియంత్రిస్తారా లేక సిద్దిపేట ను గాలికి వదిలేస్తారా చూడాలి మరీ.





