హుస్నాబాద్‌లో మాజీ ఆర్మీ సైనికునికి బీజేపీ ఘన సన్మానం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, ఆగస్టు 11:
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న “హర్ ఘర్ తిరంగా అభియాన్” కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ సైనికుడు మర్యాల వెంకట్ రెడ్డి ని బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు.
1987లో ఆర్మీలో చేరిన వెంకట్ రెడ్డి ఆశ్వధళం, సిపాయి, లాన్స్ నాయక్, నాయక్ హోదాల్లో దేశ సేవలో పలు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. గయాలో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల్లో సేవలందించి, 2004లో రిటైర్మెంట్ అయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, “దేశ సరిహద్దుల్లో సైనికులు చూపిన ధైర్యసాహసాలు ప్రతి పౌరుడికి గర్వకారణం. మోదీ గారి నాయకత్వంలో దేశం సుసంపన్న, బలమైన, ఆత్మనిర్భర భారత్ వైపు దూసుకెళ్తోంది. సైన్యంలో పనిచేసిన వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్లపెల్లి వీరాచారి, పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మయ్య, సీనియర్ నాయకులు బొనగిరి రవి, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, ఆశాడపు శ్రీనివాస్, నారోజు నరేష్, రాజు, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.