పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
రూ.43,099 నగదు తో పాటు 9 మొబైల్ ఫోన్లు,9 మోటార్ సైకిళ్లు స్వాధీనం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల దేవేంద్ర నగర్ కు చెందిన వడ్లూరి లక్ష్మణ్ పశువుల కొట్టంలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దొంతర వేణి ఐలయ్య, బొర్ర శ్రీనివాస్, చెన్నూరి శ్రీనివాస్, కుట్లు రాజయ్య, బసవేణి సాగర్, ఐపాక శ్రీనివాస్, పత్రి మహేందర్, మహమ్మద్ షబ్బీర్, వంతడుపుల వెంకటస్వామి, తూర్పాటి అనిల్, వడ్లూరి లక్ష్మణ్ అనే 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.43,099 నగదుతో పాటు 9 మొబైల్ ఫోన్లు, 9 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా వీరంతా హుస్నాబాద్ పట్టణానికి చెందిన వారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ… బహిరంగ ప్రదేశాలలో జూదం మరే ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించినా, తెలిసినా వెంటనే సిద్ధిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల ఫోన్ 8712667445 , 8712667446 , 8712667447 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి





