కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
సిద్దిపేట టైమ్స్ చేర్యాల/ కొమురవెల్లి:
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి దాదాపు 25 వేల మంది భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు పట్నాలు వేసి, గంగరేని చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి గొల్ల కేతమ్మ బలిజ మెడలమ్మలతో కొలువైన మల్లన్నను దర్శించుకుని తమ కుటుంబాలను సల్లగా చూడాలని వేడుకున్నారు. అనంతరం కొండపై కొలువైన ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
Posted inఆధ్యాత్మికం సిద్దిపేట
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..





