హుస్నాబాద్‌లో తొలి ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్లు ప్రారంభం
తొలి ఏడాది అడ్మిషన్ పొందే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, జూన్ 29:
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుండగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది శాతవాహన యూనివర్శిటీకి అనుబంధంగా హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హుస్నాబాద్( SUCE) ప్రభుత్వ కాలేజీలో తరగతులు మొదలవుతున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 21 ప్రభుత్వ కాలేజి లలో ఈ సంవత్సరం మొదటిసారి శాతవాహన యూనివర్సిటీ కి సంబంధించి హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజి లో తరగతులు ప్రారంభం అవుతున్నాయని, హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో B.Tech కోర్సులలో CSE, ECE, IT, AI విభాగాల ద్వారా ప్రతి కోర్సుకు 60 సీట్లు చొప్పున మొత్తం 240 సీట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.
మొదటిసారి ప్రారంభమవుతున్న ఈ కాలేజీలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మంచి వాతావరణంలో విద్యను కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ఆన్లైన్లో ప్రారంభమైందని, రాష్ట్రస్థాయి ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయింపు జరగనున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ మరియు పరిసర జిల్లాల విద్యార్థులు తమ ర్యాంకులను బట్టి హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీని ప్రాధాన్యతగా ఆప్షన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
తొలి ఏడాది అడ్మిషన్ పొందే విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, ఈ కాలేజీ విద్యారంగ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.






