ఘోర రోడ్డు ప్రమాదం..
ఉపాధి హామీ మహిళలు కూలీలు ఇద్దరు మృతి..
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి;
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న మహిళలపై కారు దూసుకెల్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అక్బర్ పేట-భూoపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన గ్రామస్తులు ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న సమయంలో కారు అతివేగంగా వచ్చి బ్యాగరి చంద్రవ్వ, గోప దేవవ్వ అనే ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన తోటి కూలీలు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. తీవ్ర రక్తస్రావం జరిగే ఇద్దరు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే మహిళలు మృత్యువాత పడడం బాధాకరమని, బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూలీలు రోధిస్తూ ప్రభుత్వాన్ని కోరారు.







