హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా బత్తుల శంకర్ బాబు….
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భారతీయ జనతా పార్టీ సంస్థగత ఎన్నికలో భాగంగా బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడిగా బత్తుల శంకర్ బాబు ఎన్నికైనట్టు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ… గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసినందుకు హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కి , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి కి, దూది శ్రీకాంత్ రెడ్డి కి, రాంగోపాల్ రెడ్డి కి, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కి, సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్, రాష్ట్ర నాయకురాలు లక్కి రెడ్డి తిరుమల కి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీమతి తోట స్వరూప కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి, అందరి సహాకరంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసే దిశగా పని చేస్తానని తెలియజేశారు.






