హుస్నాబాద్ నుండి జనగాం రోడ్డును నాలుగు లేన్లు గా మార్చాలి
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ నుండి అక్కన్నపేట మీదుగా జనగామ జిల్లా కేంద్రం వరకు డబుల్ లేన్ గా ఉన్న రోడ్డు నాలుగు లేన్ ల రోడ్డు గా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. జిల్లా రోడ్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ నేషనల్ హైవే రోడ్‌గా మార్చడం ద్వారా నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని జాతీయ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ హుస్నాబాద్ నుండి జనగాం రోడ్డు చాలా ముఖ్యమైన రహదారి కావున హుస్నాబాద్ నుండి జనగాం వరకు డబుల్ లేన్‌గా ఉన్న 52 కిలోమీటర్లు ఉన్న రహదారి నాలుగు లేన్లుగా అప్‌గ్రేడేషన్ చేయాలన్నారు.
హుస్నాబాద్ నుండి జనగాం వెళ్లే రహదారి కరీంనగర్, సిద్దిపేట, జనగాం జిల్లాలను కలిపే హుస్నాబాద్ పట్టణం గుండా వెళుతుందని, ఇది ముఖ్యమైన రహదారులను కలుపుతుంది అంటే హైదరాబాద్ కరీంనగర్-రామగుండం రోడ్ (SH-1) నుండి ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్ (NH-765 DG), జనగాం-NHD-36 ఇది ఆరు మండల ప్రధాన కార్యాలయాలకు, మూడు అసెంబ్లీ ప్రధాన కార్యాలయాలకు మరియు రెండు జిల్లా ప్రధాన కార్యాలయాలకు ఒక ముఖ్యమైన రహదారి కనెక్టివిటీ మరియు మూడు ముఖ్యమైన జాతీయ రహదారులను కలుపుతుందన్నారు.
కరీంనగర్ నుండి జనగాంకి ఇది అతి చిన్న మార్గం దీంతో ఈ రహదారిపై అంతర్రాష్ట్ర వాహనాల రాకపోకలు సాగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న రహదారి గుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరియు గౌరవెల్లి ప్రాజెక్ట్ కింద వ్యవసాయపరంగా సంపన్నమైన మరియు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం అయినందున, పైన ప్రతిపాదిత జాతీయ రహదారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కొమరవెల్లిలోని మల్లన్న దేవాలయం, కొలనుపాకలోని జైన దేవాలయం , యాదాద్రిలోని నర్సింహ స్వామి దేవాలయాలను కలుపుతుందని, ప్రధాన పట్టణాలైనా కరీంనగర్-కొత్తపల్లి-చిగురుమామిడి-హుస్నాబాద్-అక్కన్నపేట్-తరిగొప్పుల-నర్మెట్ట-వడ్లకొండ-జనగామను కలుపుతుంది. పై పరిస్థితుల దృష్ట్యా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం డబుల్ లేన్ నుండి నాలుగు లేన్ రోడ్డుగా మార్చాలని ఆ లేఖలో అభ్యర్థించారు.





