హుస్నాబాద్ లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడు రోజులక్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో భారత దేశ వ్యాప్తంగా జనగణన మరియు కులగణన సర్వే నిర్వహించాలని చారిత్రక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం అని ఈ సందర్భంగా శుక్రవారం రోజు హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అక్కనపెట చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్ మాట్లాడ్తు దేశస్వతంత్రము వచ్చిన తరువాత ఈ దేశాని సూదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కులాలవారిగా జనాభాను లేకించిన దాకలలు లేవు అలాగే తెలంగాణ రాష్ట్రము లో తప్పులతడకగా సర్వే నిర్వహించి ముస్లిం లను బిసి లో కలిపినటువంటి పార్టీ నేడు ప్రధాని మోడీ మాపార్టీ వల్లనే కులగణన నిర్ణయం తీసుకొన్నారని చెప్పుకోవడం సిగ్గు చేటుఅని విమర్శించారు.
SC మోర్చా రాష్ట్రఅధికారప్రతినిధి శంకర్ బాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ జనగణ& కులగనన కోసం కేంద్రకేబినెట్ ద్వారా చరిత్రక నిర్ణయం తీసుకొని అభివృద్ధిఫలాలు అట్టడుగుపేదవాడికి అందించడమే మోడీ ప్రభుత్వలక్ష్యమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు భూక్యా సంపత్ నాయక్, పట్టణప్రధానకార్యదర్శులు రాయికుంట చందు, తగరం లక్ష్మణ్, పట్టణఉపాధ్యక్షులు రాంప్రసాద్, వడేపల్లి లక్ష్మయ్య,చెన్నబోయిన రవీందర్, కార్యదర్శి వేల్పుల నాగార్జున, భూషంకర్, నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ ప్రధానకార్యదర్శి ఎర్రోజు సాయికృష్ణ, సీనియర్ నాయకులు బోనగిరి రవీందర్,వెలదండి సంతోష్, పోలోజు రవీందర్, ఎర్రబెల్లి ప్రశాంత్, బాలరాజు, అరుణ్ సందీప్ మల్లేష్ రాజశేఖర్ కుమార్ కన్నె శంకర్ సుధాకర్ తదితరులు పాలుగోన్నారు.





