రెచ్చిపోయిన దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్
రైతును ఓ కేసు విషయంలో చితకబాదిన ఎస్ఐ
మాకు పవర్ ఉంది అంతా మా ఇష్టం అంటూ పీసీ కామెంట్స్
సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్
యువ రైతుని ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని ఎస్సై చితకబాదిన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చోటు చేసుకుంది. బాధిత కుటుంబ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం దౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన మైలుగారి కృష్ణ అదే గ్రామానికి చెందిన మరికొందరితో గొడవ జరగడంతో కృష్ణ పై దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామంలో పెద్దలందరూ కలిసి గొడవను సద్దుమరిగించి రాజి కుదిరించారు. ఈ విషయం సంబంధిత ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ కి తెలియజేయగా ఊర్లో మాట్లాడుకుంటే నాకేంటని విచక్షణ లేకుండా కృష్ణని మరల పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని అతనిపై కడుపులో విచక్షణ రహితంగా కొట్టాడని వెంటనే కృష్ణ స్టేషన్ బయట పడిపోయి వాంతులు చేసుకున్నాడని తెలిపారు.వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కృష్ణ ని గజ్వేల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ సంఘటన కానిస్టేబుల్ లు సిఐ లతీఫ్ కి తెలుపగా వెంటనే చికిత్స నిమిత్తం గజ్వెల్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.ఈ ఘటనపై కృష్ణ కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తప్పు చేస్తే చట్టం ఉంది లేదా కేసు పెట్టాలి కానీ ఎస్సై ప్రేమ్ దీప్ కి కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. విచక్షణ మరిచి అహంకారపూరితంగా ప్రవర్తించిన ఎస్సై ప్రేమ్ దీప్ పైన చర్యలు తీసుకోవాలని కృష్ణ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి ఘటన బయటకు తెలియకుండా పోలీసులు సతవిధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు.ఇదంతా ఒకలగా ఉంటే దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కొందరు సిబ్బంది మాత్రం అంతా మా ఇష్టం మాకు పవర్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారని పిసి తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.





