హుస్నాబాద్ లో రెండు ఆటోలు “ఢీ”.. ఆరుగురికి తీవ్ర గాయాలు..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో గల కరీంనగర్ డైరీ సమీపంలో గురువారం రాత్రి సుమారు గం.7 ప్రాంతంలోఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని ఆరేపల్లి లో జరిగిన శుభకార్యానికి వచ్చిన క్రమంలో ఆరేపల్లి నుండి బస్టాండ్ కు పని నిమిత్తం వెళ్తున్న ఆటో (TS 02 UC4335), సిద్దిపేట రోడ్డు నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న మహీంద్రా మాక్సిమో (TS 34 TA 1365) లు కరీంనగర్ పాల డైరీ సమీపంలోకి రాగానే ఎదురెదురుగా వేగంతో ఢీకొట్టడంతో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మాక్సిమో లో ఉన్న విజయ్ అనే యువకుడి కాలు విరిగింది. తీవ్ర గాయాలైన విజయ్ అనే యువకుడికి కాలు విరగడంతో మెరుగైన చికిత్స కోసం108 లో ఎంజీఎం కు తరలించారు. మిగతా ఆరుగురికి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.