జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి
– అన్నదాత ఆగ్రో సేవా కేంద్ర ఆధ్వర్యంలో పరిశీలన
– పంట ఎదుగుదలకు జిత్రో విత్తనాలు వాడండి
– హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి వెంకట్రావు
– సిద్దిపేట టైమ్స్ దుబ్బాక ప్రతినిధి
రైతులంతా అన్నదాత వారి జిత్రో విత్తనాలు వాడి అధిక లాభాలు పొందాలని హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి వెంకట్రావు, రీజినల్ మేనేజర్ కూమర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని రైతు గుండ వెళ్లి ఎల్లారెడ్డి వేసిన వరి పంటను రైతులు,
అన్నపూర్ణ ఆగ్రోస్ సేవా కేంద్రం ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేల్స్ ఆఫీసర్ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు గుండెల్లి ఎల్లారెడ్డి 10 ఎకరాల్లో అన్నదాత వారి జీత్రో అగ్రి విత్తనాలను సాగు చేశారాని, పంట ఎదుగుదల బాగుందని వరికి ఎలాంటి తెగులు సోకలేదన్నారు. ఈ పంట గడువు ముగిస్తే నాటికీ కంపెనీ అధికారులు రైతులకు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. జీత్రో అగ్రి విత్తనాలు వాడి రైతులంతా అధిక సంపన్నులు అవుతారని తెలిపారు. రానున్న రోజుల్లో రైతులంతా ఈ సీడ్ ని వినియోగించేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ప్రతినిధి సందీప్ రెడ్డి,కంపెనీ ప్రతినిధులు, రైతులు ఉన్నారు.
Posted inదుబ్బాక
జీత్రో విత్తనాల వాడి రైతులు రాజులుకండి
