మంత్రిని కలిసిన నూతన ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్ వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా పదోన్నతి పై వచ్చిన ఎన్ వెంకన్న ఆదివారం ఉదయం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కి ఆయన మొక్కను బహుకరించారు. నూతన డిపో మేనేజర్ ని మంత్రి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.