హుస్నాబాద్ లో జాబ్ మేళాకు విశేష స్పందన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు టెక్ జేని సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం రోజు జాబ్ మేళాను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. టెక్ జెనీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కొండా శ్యాం సుందర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోరకు ఎస్ఎస్సి,ఇంటర్, డిగ్రీ ,ఐఐటి, డిప్లమా, బిటెక్ చదువుకున్న నిరుద్యోగుల కొరకు ఈరోజు 8 కంపెనీల సంస్థల సహకారంతో హైదరాబాద్, వివిధ ప్రాంతాల్లో అసెంబ్లీ ఆపరేటర్లు, ప్రొడక్షన్ లైన్ ట్రైనీ, క్రెడిట్ కార్డుల నిర్వాహకులకు, టెలికాలర్ల ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు వారి అర్హతల ప్రకారం ఎంపిక చేసి స్పాట్ ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ ప్రైవేట్ కంపెనీల సహకారంతో హుస్నాబాద్ లో రెండుసార్లు జాబ్ మేళాను నిర్వహించారని, ఈరోజు టెక్ జీని సంస్థ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగుల కొరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ ప్రాంత నిరుద్యోగుల కొరకు ప్రైవేట్ సంస్థలలోని వివిధ రంగాలలో ఉద్యోగాల కొరకు జాబ్ మేళా ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 60 మంది వరకు ఇంటర్వ్యూకు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇంటర్వ్యూలో అసెంబ్లీ ఆపరేటర్లు గా, ప్రొడక్షన్ లైన్ ట్రైనీలుగా, క్రెడిట్ కార్డు సేల్స్ లో, టేలీ కాలర్ జాబ్స్ కొరకు 23 మంది ఎంపికైనట్లు ఆ సంస్థ డైరెక్టర్ కొండా శ్యాం సుందర్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక ధన్య వాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్ జేఏసీ కో- కన్వీనర్ మేకల వీరన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.