రేపు హుస్నాబాద్ లో పట్టభద్రులతో ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ తో సోమవారం రోజు హుస్నాబాద్ లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ప్రసన్న హరికృష్ణ గౌడ్ టీం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం రోజున హుస్నాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షలకై డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఎంతో సహకారం అందించారని అన్నారు. పేద ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయుటకు 19 సంవత్సరాల సర్వీసును వదిలిపెట్టి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను కలవడానికి 24న స్థానిక రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లు వెంకటేష్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యడ కొమురయ్య గౌడ్, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, వొద్దిరాల రాజు, తాళ్ళపల్లి సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
