ప్రసన్న హరికృష్ణ కే బీసీల మొదటి ప్రాధాన్యత ఓటు
నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

కరీంనగర్ నిజాంబాద్ అదిలాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ కు బీఎస్పీ పార్టీ మరియు బీసీ సంఘాల పక్షాన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీసీ బిడ్డను గెలిపించాలని ఆదివారం సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బి.ఎస్.పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, బీసీ నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ లు కల్పిస్తామని గొప్పగా చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ నియోజకవర్గం లో మొత్తం 3, లక్షల 51 వేల ఓట్లలో బీసీల ఓట్లే 1,50 వేల వరకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు లక్ష వరకు ఉన్నాయని, ఓసీల ఓట్లు కేవలం 50 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని, అయినా ఏ సామాజిక న్యాయం ప్రకారం ఓసీలకు సీటు ఇచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మమ్మల్ని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తో పోటీపడి మరో రెడ్డికి టికెట్ ఇచ్చారని, నిజానికి బీసీలకు బీసీలే శత్రువులుగా మారడం వల్ల ఈరోజు ఓసి వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి అని అన్నారు. వెంటనే ఇట్టి విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఐక్యమత్యంగా పులి ప్రసన్న హరికృష్ణ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ & బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, సైదాపూర్ మండల అధ్యక్షులు పొడిసెట్టి అశోక్, బీసీ నాయకులు పంజాల కొమరయ్య జనగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.





