‘పులి ప్రసన్న హరికృష్ణ ని’ భారీ మెజార్టీతో గెలిపించాలి
బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం, బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ… కరీంనగర్ నిజాంబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు ఉద్యోగులు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు ఉన్నత విద్య చదివి ఎంతోమంది విద్యార్థులకు విద్యా సహాయం చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా తన వంతు సహాయం చేసిన ప్రసన్న హరికృష్ణ ని గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో ఈ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మూడు లక్షల 51 ఓట్లు ఉంటే అందులో సగం ఓట్లు బీసీలవి ఉన్నాయని. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన లక్ష వరకు ఉన్నాయి. కేవలం 50 వేలఓట్లు ఉన్న ఓసీలకే కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఓసి వర్గంలోని రెడ్డిలకు టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రెండు పార్టీలు సామాజిక న్యాయం చేస్తామని చెప్పుకుంటూ అధిక ఓటు బ్యాంకు ఉన్న వారిని కాకుండా కేవలం డబ్బు ప్రాతిపదికనే టికెట్లు ఇచ్చారన్నారు. ఈ ఎన్నికలు కార్పొరేట్ వ్యవస్థలకు, బీసీ సామాజిక వర్గం లోని ఒక సామాన్య కార్యకర్తకు జరుగుతున్న పోరాటంగా ఆలోచన చేయాలన్నారు. ఇట్టి పోరాటానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, కళ్ళు గీత కార్మిక సంఘం నాయకులు దేశిని రాజయ్య, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు వెలుపల రాజు తదితరులు పాల్గొన్నారు





