హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు భాగంగా ఈరోజు హుస్నాబాద్ డిపో కు ప్రత్యేక అతిథిగా హుస్నాబాద్ పట్టణ ఎస్ఐ(SI) మహేష్ హాజరై మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న డ్రైవర్లు అందరూ కూడా ముందు వస్తున్నటువంటి వాహనదారులను జాగ్రత్తగా గమనిస్తూ బస్సు నడపాలని, మరియు సెల్ఫోన్ డ్రైవింగ్ పూర్తిగా నిషేధించాలని, మన యొక్క బస్సును డిఫెన్స్ చేస్తూ నడపాలని సూచించారు. అలాగే డిపో మేనేజర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ విధి నిర్వహణలో జాగ్రత్తగా బస్సులు నడుపుతూ ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలను అందించాలని, ఈ 2025 సంవత్సరానికి గాను హుస్నాబాద్ డిపోను యాక్సిడెంట్ ఫ్రీ డిపోగా మార్చాలని సూచించడం జరిగింది . అనంతరం యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను సన్మానించడం జరిగింది. నవంబర్ మరియు డిసెంబర్ మాసాలకు గాను ప్రగతి చక్ర అవార్డ్స్ ను మరియు బెస్ట్ ఈ.పి.కే. బెస్ట్ కే. ఎం. పి .ఎల్. తీసుకువచ్చిన కండక్టర్ డ్రైవర్లకు ప్రశంస పత్రాలు మరియు నగదు బహుమతులు అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో AMF మరియు ఆఫీస్ సూపర్డెంట్, ట్రాఫిక్ సూపర్వైజర్, సెక్యూరిటీ హెడ్ గార్డ్, గ్యారేజీ సిబ్బంది మరియు డ్రైవర్ కండక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.