జాతరకు ముస్తాబైన” బండ మల్లన్న”

జాతరకు ముస్తాబైన” బండ మల్లన్న”

జాతరకు ముస్తాబైన” బండ మల్లన్న”

  • సంక్రాంతి 14 న ప్రధాన జాతర
  • భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన మల్లన్న దేవుడు
  • హైద్రాబాద్ మహానగరంతో పాటు ఇతర జిల్లా నుంచి రావడం ప్రత్యేకత
  • మల్లన్న బండ కొండంత అండ అంటున్న భక్తులు
  • జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి : ఆలయ కమిటీ
  • పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్న దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్

సిద్దిపేట టైమ్స్ అక్బర్ పేట్/ భూంపల్లి

ఏళ్లనాటి పురాతన చరిత్ర కలిగిన ఆలయం అది. నిత్యం పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన “బండమీది మల్లన్న ఆలయానికి ” ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఊరంతా కలిసి బండ మల్లన్న జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. విశేష పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే బంగారు మహిమగల్లా మల్లన్న పై సిద్దిపేట టైమ్స్ ప్రత్యేక కథనం

సిద్దిపేట జిల్లాకు 30 కిలో మీటర్ల దూరంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది.ఈ ఆలయం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి,జంగపల్లి,గాజులపల్లి గ్రామాల పొలిమేరలలో “మల్లన్న బండ “ఉంది.ఐతే ఈ మల్లన్న స్వామి ఆలయంలో
నిత్య పూజలు అందుకుంటూ ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తులతో పాటు ఇక్కడి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుండటం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పర్వదినాన వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన బండ మల్లన్న జాతర జరుగుతుంది.దాదాపు 120 ఎకరాల విస్తీర్ణం,60 గజాల ఎత్తు కలిగి ఉన్న బండపై పరమేశ్వరుడు మల్లన్న దేవుడిగా అవతరించి ఇక్కడే ప్రజల పాలిట కొంగుబంగారంగా అవతరించారని ప్రజలు విశ్వాసిస్తున్నారు.విశాలమైన ఈ బండపై రాజరాజేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర ఆలయం పాండవుల విగ్రహాలు, హనుమాన్ దేవాలయం,నాగదేవత ఆలయం, పోచమ్మ దేవాలయం తో పాటు పుట్టుగుండం మల్లన్న పాదముద్రలతో పాటు ఎన్నో దేవత విగ్రహాలు దర్శనమిస్తుంటాయి.ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో బండపై బోనాల ప్రారంభంతో సంక్రాంతి సంబరాలు ఆయా గ్రామాల్లో ప్రారంభమై సంక్రాంతి వరకు కొనసాగుతుంది. బండ చుట్టూ ఉన్న గ్రామాలు వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, గాజులపల్లి, అల్మాజిపూర్, గ్రామాలకు చెందిన ఎడ్లబండ్లు బండపై కొలువుదీరిన మల్లన్న దేవాలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. బండపై శాససిద్ధంగా వెలసిన పుట్టుగుండంలో దశాబ్దాలుగా గడుస్తున్న బావిలో నీరు ఎన్ని కరువు కాటకాలు ఎదురైనా నేటికీ నీరు పుష్కలంగా ఉండడం మల్లన్న దేవుడి మహిమగా భక్తులు కొనియాడుతున్నారు. పుట్టుగుండంలోని నీరు రైతులు తమ తమ పొలాల్లో చల్లినట్లయితే పంటలు విరివిగా పండుతాయి అని రైతులు గొప్పలుగా చెప్పుకుంటారు. బండ మల్లన్న జాతర ఈ నెల 14,15 రెండు రోజుల పాటు బండపైన అలాగే వీరారెడ్డిపల్లి,జంగాపల్లి ఈ రెండు గ్రామాల్లో జాతర జరుపుకుంటారు. మల్లికార్జున దేవాలయం సహజసిద్ధంగా వెలిసిన సొరికే లాంటి బండలో వెలిసిన ,కారణంగా బండ మల్లన్నగా పేరు ప్రఖ్యాతలుగా ప్రసిద్ధి చెందింది.ఈ జాతరకు వరంగల్, కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ వంటి జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా బండ మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.పరమశివుని ఆజ్ఞ లేకుండా పార్వతి తన తండ్రి అయిన దక్షరాజు వద్దకు వెళ్లిందన్న కోపంతో దక్షరాజు పైకి దండెత్తి తిరుగు ప్రయాణంలో అలసిపోయి ఈ బండపై సేద తీరుతుండగా చెమటతో నిండిన దేహాన్ని తడుముతూ చేతికి వచ్చిన చెమటను తీసి విసరడంతో సరికలో ఉన్న మట్టి బెడ్డలపై పడడంతో ఓ పసివాడు ఉద్భవించాడని శివుని మారు చెమటతో బండపై వెలసినందున బండ మల్లన్నగా పిలవబడి ఇక్కడి భక్తులు కొలిచే దైవంగా వెలిసి భక్తుల పాలిట కొంగుబంగారమై వర్ధిల్లు మని అంతర్దాన మయ్యాడని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలుగా చెప్పుకుంటారు.దీనికి నిదర్శనంగా మల్లన్న బండపై పెట్టిన అడుగు ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది.

భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి: ఆలయ కమిటీ

ఈ నెల 14 సంక్రాంతి రోజు బండ మల్లన్న జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాటు చేసినట్లు ఆయా గ్రామాల మాజీ సర్పంచులు పన్యాల వెంకటరెడ్డి,కంచం యాదగిరి,మాజీ ఎంపీటీసీ బాల మల్లేశం గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ లింగాల వెంకట్ రెడ్డి,ఆలయ అర్చకులు,జంగం కొమురయ్య, చెబుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలనీ సూచిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు.

పటిష్టమైన భద్రతా, బందోబస్తు నిర్వహిస్తున్నాం

-దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్,ఎస్ఐ హరీష్ గౌడ్

మల్లన్న జాతర సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశాం.కావాల్సిన పోలీసు బలగాలు సిబ్బందితో పాటు ముగ్గురు ఎస్ఐ లతో పాటు ఏర్పాట్లు పూర్తి అయ్యింది. జాతరలో దొంగలు, అపరిచితుల దృశ్య భద్రత పెంచాం.భక్తులకు ఎవరైనా అపరిచితులు అనుమానాలు కనిపిస్తే ప్రత్యేక హెల్ప్ డెస్క్, లేదా సంబంధిత పోలీసులకు, అవసరమైతే డయల్ 100 చేయాలని పిలుపునిస్తున్నాం.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *