కత్తి కార్తిక సేవలు అభినందనీయం
– ఆడబిడ్డల అండగా కత్తి కార్తిక
– మా ఇంటి మహాలక్ష్మి ద్వారా నిరుపేదలకు చేయుత
– 20 వ వార్డు కౌన్సిలర్ లొంక రాజవ్వ లచ్చయ్య
సిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
నిరుపేదల కు అండగా ఉండి ఏలాంటి స్వార్థం లేకుండా బిఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ సేవ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని 20వ వార్డు కౌన్సిలర్ లొంక రాజవ్వ లచ్చయ్య అన్నారు. శనివారం రోజున 20 వ వార్డులోని రాయిని లాస్యకు శ్రీమంతం కానుకగా న్యూట్రిషన్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. నేటి కాలంలో నిరుపేద మహిళలకు అండగా ఉంటూ చేయూతను అందించడం ఎంతో సంతోషకరంగా ఉందని వారు అన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న నేనున్నాను అంటూ కత్తి కార్తిక గౌడ్ వెళ్లి నిరుపేదలకు బాసట గా నిలవడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి గొప్ప మహిళా నాయకురాలు దుబ్బాక నియోజక వర్గంలో సేవలు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం దుబ్బాక మండలం మరియు భూంపల్లి అక్బర్పేట్, మండలంలోని ఆయా గ్రామాల్లో బాలింతలకు న్యూట్రిషన్ కిట్లు అందజెసి బాధిత కుటుంబాలను పరమార్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కొత్త దేవి రెడ్డి, కామోజీ అనురాధ,రాయిని లక్ష్మీ ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.






