బిజెపి దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్
– అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా
– రానున్న రోజుల్లో మున్సిపాలిటీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తాం
– నూతన మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడిగా దొరగొల్ల శ్రీకాంత్ యాదవ్ ను నియమిస్తూ బిజెపి సిద్ధిపేట జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ సారంగుల అమర్నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ… నాపై నమ్మకం తో నన్ను దుబ్బాక మున్సిపల్ అధ్యక్షునిగా నియమించినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, దుబ్బాక మున్సిపాలిటీపై బిజెపి జెండా ఎగిరే వరకు కృషి చేస్తానని అన్నారు.






