చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు
చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు
ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలి
తల్లిదండ్రులను విద్యను నేర్పిన గురువులను జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి
మాంటిస్సోరి స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాల అవగాహన కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్సై మహేష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మాంటిస్సోరి హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి, సీసీ కెమెరాలు, ఈవిటీజింగ్ సైబర్ నేరాల గురించి, నూతన చట్టాల గురించి హుస్నాబాద్ ఎస్ఐ. మహేష్, హుస్నాబాద్ షీ టీమ్ బృందం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, మాట్లాడుతూ… కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ మేడమ్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్ గురించి. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. జులై 1 నుండి అమలవుతున్న నూతన చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మహమ్మద్ అబ్దుల్, ఉపాధ్యాయులు షీటీమ్ బృందం సదయ్య , హెడ్ కానిస్టేబుల్, మహిళ కానిస్టేబుల్ ప్రశాంతి, కానిస్టేబుల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

