జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు సమస్యకి చెక్
జర్నలిస్టుల పట్టాలు పంపిణీ చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన హుస్నాబాద్ జర్నలిస్టు లు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 40 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యకు మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్ పెట్టారు. జర్నలిస్టులకు పట్టాలు పంపిణీ చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఇల్ల పట్టాలు పొందుతున్న జర్నలిస్టు లకి శుభాకాంక్షలు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టు లు పని చేయాలన్నారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టు లకి కూడా ఇల్ల స్థలాలు ఇవ్వాలని, హుస్నాబాద్ లో ఇంకా ఇల్ల స్థలాలు రాని జర్నలిస్టు ల సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఇతర మండలాల్లో ఉన్న జర్నలిస్టు లకి ఇల్ల స్థలాలు ఇవ్వడానికి ఆర్డీవో ఇతర అధికారులతో సమన్వయం చేసుకోవాలని, నేను ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జర్నలిస్టు ల అందరికీ ఇల్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో నాతో పాటు మీకు బాధ్యత ఉందని, ప్రజా సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురమ్మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య,మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆర్డీవో ఎమ్మార్వో, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
