శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి..
సిద్దిపేట టైమ్స్ చేర్యాల :
చేర్యాల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం కాలనీ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షునిగా బర్రె శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అందె సుధాకర్ రెడ్డి, కోశాధికారిగా పెంటపర్తి కొండల్ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడిగా మెట్టుగారి ఐలయ్య, ఉపాధ్యక్షులుగా చింతల వేణుగోపాల్ రెడ్డి, బుడిగ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శులుగా షాడగొండ సంజీవరెడ్డి, బైర నరహరి సలహాదారులుగా మంద లక్ష్మారెడ్డి, తుపాకుల బాబు ఆడిట్ కమిటీ సభ్యులుగా గుంటి బుచ్చయ్య, కూరపాటి మల్లేశం పీఆర్వోగా బొంగు చంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బర్రె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని సభ్యులందరూ సహకరించాలని కోరారు. కాలనీ అభివృద్ధికై అందరి సహకారం తీసుకుంటూ కాలనీ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తూ దాని పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కార్యవర్గం వారు ప్రతిజ్ఞ చేశారు.