అర్జున్ పట్ల విద్యార్థికి జిల్లా స్థాయిలో బహుమతి.
సిద్దిపేట టైమ్స్ చేర్యాల
శ్రీ వాణీ సాహిత్య పరిషత్ వారు నిర్వహించిన బాలల కథా రచన పోటీలో చేర్యాల మండలం లోని అర్జున్ పట్ల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విష్ణు వర్ధన్ జిల్లాస్థాయిలో బహుమతిని పొందడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుడు రామచంద్రమూర్తి శిక్షణ లో కథా, కవితా రచనలో విద్యార్థి ప్రతిభ ను చాటుతున్నాడు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విష్ణు వర్ధన్ ముఖ్య అతిథి కాసర్ల నరేష్ రావు ఎర్రోజు వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి గురువు మూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస రావు ఉపాద్యాయులు యశోద సుదర్శన్ రెడ్డి గంగప్రసాద్ కులకర్ణి సరిత రజిత షాదుల్ల తో పాటు తోటి విద్యార్థులు అభినందించారు.