వేణుగోపాల స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు..
సిద్దిపేట టైమ్స్, చేర్యాల
చేర్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 21వ రోజున ప్రత్యేక పూజలు జరిగాయి. గోదా అనే అక్షర రూపంలో భక్తులు కూర్చుని దేవికి ద్రవిడ ప్రబంధ సేవా కాలం తిరుప్పావై పాశుర విన్నపం తో పాటు గోదా అష్టోత్తర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు వైదిక సాంప్రదాయములో పొంగలి నివేదన జరిగింది. ఈ సందర్భంగా జై శ్రీమన్నారాయణ నామస్మరణతో చేర్యాల పట్టణం మారు మ్రోగగా ఆలయ ప్రధాన అర్చకులు మంగళగిరి శేషాచార్యులు, రాజు స్వాములు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.