రేపు “డయల్ యువర్ డీఎం”
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ మెరుగైన సేవలందించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ డిసిహెచ్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు తెలియజేయడానికి 7382852772 కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని ఆయన చెప్పారు. కావున ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.