నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి..

నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి..

నందిని సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యం, మూర్ఖత్వం..
కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు..
రాజకీయం పార్టీ మెప్పు కోసం తన మేధావి తనన్ని పణంగా పెట్టారు..
ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి
   నందిని సిద్దారెడ్డి కేసీఆర్, బీఆర్ఎస్ మెప్పు కోసం తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రముఖ శిల్పి, చిత్రకారుడు యం. వి. రమణ రెడ్డి అన్నారు. ఆత్మగౌరవంతో బ్రతికే కళాకారుడిగా, కళనే నమ్ముకొని, కళకోసం పరితపించి ఈ ప్రాంత సగౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి, రాజకీయాలకు అతీతంగా నావంతు పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నానని  రమణ రెడ్డి అన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహాంలో తెలంగాణ మాతృ మూర్తి, చాకలి ఐలమ్మ, ఉద్యమ స్పర్తిని ఉట్టి పడేలా రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. దిన్ని నందిని సిద్దారెడ్డి కోట్ల రూపాయల తీసుకుని తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చారని తప్పుడు  ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞాతకు నిదర్శనం అన్నారు.

తెలంగాణ తల్లి శిల్పులపై ఆరోపణలు చేస్తూ, ఒక నిజాయితీ కలిగిన కళాకారుడిపై కోట్ల రూపాయలు తీసుకొని కొత్త తెలంగాణ తల్లి శిల్పాన్ని రూపుదిద్దారని అభాండాలు వేయడం దుర్మార్గమన్నారు.

నూతన తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణానికిగాను ఈనాటికి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదు అని పత్రిక ముఖంగా తెలియచేస్తున్నాను. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు, అడ్వాన్స్ లు కూడా ఉండవనే విషయం సిధారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో నేను ప్రభుత్వ సంస్థలకు చేసిన నాలుగైదు పనుల్లో నేటికీ బిల్లులు విడుదల కాలేదు. ఉన్నత పదువులు చేసిన ఈ ప్రాంతానికి చెందిన నాయకులు ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. పైగా కోట్లు తిన్నారనడం సిగ్గుచేటు అన్నారు.
సిద్దారెడ్డి ఉపాధ్యాయుడు, మేధావి అనుకుంటే కేవలం రాజకీయం పార్టీ మెప్పు కోసం తన మేధావి తనన్ని పణంగా పెట్టారని స్పష్టం అవుతుందన్నారు. తనకు రాజకీయాల కు ఎలాంటి సంబంధం లేదని, తాను గత ప్రభుత్వంలో పనిచేశానని, ప్రస్తుత ప్రభుత్వంలో పని చేస్తున్నాని, రాబోయే ప్రభుత్వం ఏదైన పని చేస్తానని పార్టీ ల కోసం పని చేసే స్వాభావం  తనది కాదన్నారు. కేవలం సిద్దారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ దగ్గర క్రెడిట్ కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో పని చేస్తే తనకు అన్యాయం జరిగిందని, తను హైదరాబాద్ లో  రూపం ఇచ్చిన తెలంగాణ అమరవీరుల స్తూపం కోసం పనిచేస్తే ప్రస్తుత ఎమ్మెల్సీ  దేశపతి శ్రీనివాస శర్మకు లంచం ఇస్తేనే తనకు బిల్లు ఇచ్చారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ముట్ట మొదటి సారి డీల్లీ లో తాను డబ్బు కర్చు చేసి రూపొందించిన తెలంగాణ శకటం పేరు మార్చి  ఇతర రాష్ట్రాల వారికి లక్షల రూపాయల ఇచ్చారని స్పష్టం చేశారు.

సిధారెడ్డి ఆరోపణలు, అర్థరాహిత్యంగా, మూర్ఖంగా అనిపిస్తున్నాయి. కళాకారులను అగౌరవపరుస్తూ కళను డబ్బుతో ముడిపెట్టి, డబ్బుకోసమే కళాకారుడు ఉన్నట్టు ఆరోపణలు చేయటం, ఒక విద్యావేత్తగా, పెద్దమనిషిగా సిగ్గుచేటు. గత ప్రభుత్వంలో అధికారహోదాలను అనుభవించి, ఆస్వాదించి, డబ్బుల్లో మునిగి, అంతా డబ్బులమయమనే అహంకారంతో సిధారెడ్డి. మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నేను ఏ పదవులు చేపట్టలేదు లేదా ప్రభుత్వ ఉద్యగం రాలేదన్నారు. సిద్దారెడ్డి ఇలాంటి చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

రమణ రెడ్డి ని సన్మానిస్తున్న కాంగ్రేస్ నాయకులు జి శ్రీనివాస్, జి నరేష్ గౌడ్ తదితరులు..
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *