రేపు సిద్దిపేట లో విద్యుత్ సరఫరాలో అంతరాయం..
సిద్దిపేట ఎలక్ట్రిసిటీ ఏడిఈ సుధాకర్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
రేపు సిద్దిపేట తో పాటు పలు శివారు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని సిద్దిపేట ఎలక్ట్రిసిటీ ఏడిఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట 220కేవి/132కేవి సబ్ స్టేషన్ లో మరమత్తుల నిర్వహణ ఉన్నందున 27 బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మరమ్మత్తుల పనులు నిర్వహించనున్నందున అంతరాయం ఉంటుందన్నారు.
సిద్దిపేట పట్టణంతో పాటు శివారు గ్రామాలు లింగారెడ్డి పల్లె, గాడిచర్ల పల్లె, నర్సాపూర్, డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీ, రంగధాంపల్లి, గుండ్ల చెరువు, గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వినియోగదారులందరూ మరియు రైతులందరూ సహకరించాల్సిందిగా కోరారు.