ఇందిరా గాంధీ విగ్రహానికి భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ఇందిరా గాంధీ విగ్రహానికి భూమిపూజ చేశారు. అనంతరం ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరా గాంధీ తనకంటూ చిరస్థాయిగా పేరు నిలుపుకుని, నేటికీ ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి అని మనమంతా కోరుకొనే ఇందిరమ్మ జయంతి సందర్భంగా పట్టణంలో ఇందిరా గాంధీ విగ్రహానికి శంఖు స్థాపన చేసుకున్నాం అని అన్నారు. దేశ ఐక్యత చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి హత్యకు గావింపబడ్డ ఇందిరాగాంధీ ఆశయాలను నేటి యువత ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. వచ్చే ఇందిరా గాంధీ జయంతి లోపు ఇక్కడ విగ్రహం తో పాటు ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుందాం అని, ఇందిరాగాంధీ ఆలోచనలు అయిన గరిబి హటావో, బ్యాంకుల జాతీకరణ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళా గా పరిపాలన దక్షతగా పాలించిందన్నారు. ప్రపంచంలోనే తనకంటూ ఒక పేరు నిలుపుకున్న ఇందిరాగాంధీ ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఇందిరాగాంధీ ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలని ఏ రాజకీయ పార్టీ అయినా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.





