టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాజుల భగవాన్ నేత
అభినందించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ ప్రాంత పద్మశాలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గాజుల భగవాన్ నేతను టిపిసిసి వీవర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు పద్మశాలి నాయకుల సమక్షంలో గాజుల భగవాన్ నేతను అభినందించారు. గాజుల భగవాన్ నేత గతంలో తెలంగాణ రాష్ట్ర పోప ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజా పరిపాలనలో నేతన్న ఉపాధికి, సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరారు. అనంతరం భగవాన్ నేత మాట్లాడుతూ… టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు గాజుల భగవాన్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రయోజనాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. పద్మశాలీలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానన్నారు. తనకు ఉపాధ్యక్ష పదవి రావడానికి సహకరించిన స్థానిక, జిల్లా, రాష్ట్ర పద్మశాలి నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజా పరిపాలనలో రాష్ట్ర చేనేత జౌళి పరిశ్రమ శాఖతో కలిసి, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, చేనేత వర్గానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి వెంకటరమణ, అక్కు శ్రీనివాస్, మంజులా రెడ్డి, గంపల శ్రీనివాస్ గాజుల భగవాను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బూర్ల రాజయ్య, పట్టణ బాధ్యులు కోమటి సత్యనారాయణ, కొండ సత్యనారాయణ, వడ్డేపల్లి బాలయ్య, వడ్డేపల్లి రాజేశం, దూడం నాగభూషణం, లక్ష్మీపతి, కనకయ్య, మోహన్, శ్రీనివాస్, పాము రాజన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.





