హుస్నాబాద్ లో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని మల్లె చెట్టు చౌరస్తాలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని భారత స్వతంత్ర పోరాట నాయకులు, వారు భారతదేశం అభివృద్ధి కోసం నూతన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారని మరియు నెహ్రూ గౌరవార్ధం ప్రతి ఏటా నవంబర్ 14న నెహ్రూ కి చిన్న పిల్లల పై ఉన్న ప్రేమ అనురాగాలు కారణంగా ఆయనను ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుచుకుంటారు అని వారి జ్ఞాపకార్ధంగా ప్రతియేటా బాలల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గౌడ్ కమిషనర్, కొంకటి నళిని దేవి, బోజు రమాదేవి, పున్న లావణ్య, పేరుక భాగ్యరెడ్డి, చిత్తారి పద్మ రవి, వల్లపు రాజు, బొజ్జ హరీష్, వాల సుప్రజా, కౌన్సిలర్లు ఆకుల వెంకన్న మాజీ ఎంపీపీ, ఐలేని శంకర్ రెడ్డి, యండి ఆయూబ్ కో ఆప్షన్ సభ్యులు, వాలా నవీన్ రావు, పున్నసది, చంద్రమోహన్ సూపర్డెంట్, జాలిగాం శంకర్ జూనియర్ అసిస్టెంట్, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





