బాలల దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రత్యేక ప్రతినిధి:
భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలలందరికి రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి, అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని మంత్రి పునరుద్ఘాటించారు. బాలలు తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు అని, భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పాలనీ ఆకాంక్షించారు. రేపటి భావి భారత పౌరులను తయారు చేయడంలో భాగంగానే విద్యా రంగంలో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా నిపుణులతో కూడిన విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ తో పాటు విద్యా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దీపావళి సందర్భంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లలో చదువుతున్న విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
Posted inతెలంగాణ
బాలల దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి పొన్నం ప్రభాకర్





