సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని శాసనమండలికి పంపించాలి
విద్యా విధానంలో సమూల మార్పులు అవసరం
నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు రెండవ దశ ఎన్రోల్మెంటుకు అవకాశం ఉంది
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పులు తేవాలంటే విద్యావేత్తతోనే సాధ్యమని, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని శాసనమండలికి పంపించి కొత్త రాజకీయానికి తెర తీయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ కు విచ్చేసిన సందర్భంగా ప్రజా సంఘాలు, పలు ప్రైవేటు పాఠశాలాల ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ…. మార్చి 2025లో పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6 వరకు ఎన్ రోల్మెంట్ ప్రక్రియ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ నాలుగు జిల్లాలు కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు సంబంధించి సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6 వరకు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇందులో 3,58,00 ఎన్రోల్మెంట్స్ జరగగా కేవలం ప్రసన్న హరికృష్ణ టీం నుండి 1,48,420 జరిగాయని ఇందులో ఎక్కువగా హుస్నాబాద్ టౌన్ అలాగే హుస్నాబాద్ మూడు మండలాలకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. ఇప్పటికే అప్లై చేసుకున్న పట్టభద్రుల అప్లికేషన్స్ రిజెక్షన్స్ లేదా ఆబ్జెక్షన్స్ అయితే వారు మళ్లీ అప్లై చేసుకోవాలని,కొత్తగా ఎన్రోల్మెంట్ చేయాలనుకునే పట్టబద్రులు నిరాశ చెందకుండ అప్లై చేసుకోవాలని తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండే ప్రతి పట్టభద్రుడు మంచి సామాజిక స్పృహ ఉన్న వారిని ఎన్నుకొని శాసనమండలికి పంపించాలని పిలుపునిచ్చారు.





