డిగ్రీ విద్యార్ధిని చెయ్యి కోసి పరారైన ప్రేమోన్మాది..
మెదక్ డిగ్రీ కళాశాల వద్ద ఘటన…
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి;
డిగ్రీ కళాశాల వద్ద ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్ధిని దివ్య కృప ను ప్రేమోన్మాది చేతన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా ఆమె కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
మెదక్ మున్సిపల్ పరిధిలోని అవుసుల పల్లి కి చెందిన దివ్య కృప హైదరాబాద్ లో చదువుతుండగా పరిచయం ఏర్పడిందని అంటున్నారు.ఉదయం 8,30 ప్రాంతంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్ధిని దివ్య తో ఘర్షణ పడ్డ చేతన్ వెంట తెచ్చుకున్న కత్తి తో దివ్య పై దాడి చేయగా చేతు అడ్డుపెట్టి తప్పించు కుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.దివ్య కృప కుడి చెతుకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ లు
నిందితుని కోసం గాలిస్తున్నారు.
