ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని సోమవారం రాత్రి బాధితురాలి తల్లి దరఖాస్తు ఇవ్వగా వెంటనే ఫోక్సో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించామని హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ తెలిపారు. కేసు పరిశోధనలో భాగంగా బాలికను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు హుస్నాబాద్ వాసులు గా గుర్తించామని, పై ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది అని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని పూర్తి వివరాలు విచారణ పూర్తి చేసిన తర్వాత తెలియపరచడం జరుగుతుందని హుస్నాబాద్ ఏసీపి సతీష్ తెలిపారు.