గాలి బుడగ ఎక్కేద్దాం.. అరకు అందాలు చూసేద్దాం!
సిద్దిపేట టైమ్స్, వెబ్
అరకులోయ ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించే సౌలభ్యం పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ చొరవతో ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం పద్మాపురం ఉద్యానంలో నిర్వహించిన ‘హాట్ ఎయిర్ బెలూన్’ ట్రయల్‌రన్ విజయవంతమైంది. మంగళవారం నుంచి పద్మాపురం ఉద్యానంలో ఈ బెలూన్ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు బెలూన్ రైడ్‌కు అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు గట్ల సంతోష్ తెలిపారు. 300 అడుగుల ఎత్తువరకు విహంగ వీక్షణానికి వీలు కల్పిస్తుండగా ఒక్కో వ్యక్తికి రూ.1500 రుసుం వసూలు చేయనున్నట్లు చెప్పారు.