హుస్నాబాద్ లో ఏసీపి సతీష్ ఆధ్వర్యంలో “కమ్యూనిటీ కాంటాక్ట్”
ఎలాంటి పేపర్లు లేని 17 మోటార్ సైకిళ్ళు స్వాధీనం
ప్రజలకు రక్షణ మరియు భద్రతాభావం కల్పించడమే లక్ష్యం
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
నూతన చట్టాలతో నేరస్తులకు కఠినంగా శిక్షలు
సైబర్ నేరం జరిగితే టోల్ ఫ్రీ నెంబర్లు 1930 లేదా డయల్ 100 కు కాల్ చేయాలి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో హుస్నాబాద్ ఏసీపి సతీష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఎలాంటి పేపర్లు లేని 17 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ప్రజలకు రక్షణ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపి సతీష్ మాట్లాడుతూ… ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, పట్టణాలలో కాలనీలో గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరియు సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సంవత్సరం జూలై 1 నుండి భారతదేశ వ్యాప్తంగా నూతన చట్టాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ చట్టాలలో నేరం చేసిన నేరస్తులకు కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ టీఎస్ కాప్ అధునాతన యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నషన్ సిస్టం ద్వారా అనుమానితుల ఫోటో తీసి చెక్ చేయడం ద్వారా ఎవరైనా పాత నేరస్తులు నేరం చేసి ఉంటే వెంటనే వారి ఫోటో వారి బయోడేటా వారు చేసిన నేరం వివరాలు క్షణంలోనే తెలిసిపోతాయి పాత నేరస్తుల ఫోటోలు తీసి మరియు ఫింగర్ ప్రింట్ ద్వారా చెక్ చేయడం జరిగిందని తెలిపినారు. అత్యవసర సమయంలో పోలీసుల అవసరం ఉంటే తప్పనిసరిగా డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే టోల్ ఫ్రీ నెంబర్లు 1930 డయల్ 100, కాల్ చేయాలని తదితర అంశాల గురించి గ్రామస్తులకు తెలియపరిచారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు బ్లూకోల్ట్స్ బృందాలతో పెట్రోలింగ్లను ముమ్మరం చేస్తామని చెప్పారు. కాలనీవాసులు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకరావాలని కోరారు. సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణ, చేదన కోసం సిసి కెమెరాలు దోహదపడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ కొండ్ర శ్రీను, హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, కోహెడ ఎస్ఐ అభిలాష్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.