పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
సిద్దిపేట టైమ్స్, చిన్నాకోడూరు,
చిన్నాకోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994-95లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రాములు, జగ్గారెడ్ఢి, అంజిరెడ్డి, చంద్రారెడ్డి, పోచమల్లయ్య, సుందరయ్య, రాజమణీ, లక్ష్మీనారాయణమ్మ లు మాట్లాడుతూ, అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఏన్నో ఏళ్ళ తరువాత కూడా తమను గుర్తుంచుకుని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం చేశారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మడూరి నాగరాజు, పెద్ది రాజు, రవి, శివకుమార్, గూడ మహేందర్, విజయరెడ్డి, జాలపెల్లి మధు, తిరుపతి రెడ్డి, గుడుమల్ల రవి, ఉమాపతి, కవిత, సునిత, రజిత, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.