‘పంచాయతీ’ కోసం ఎదురుచూపులు..
గాడి తప్పుతున్న గ్రామ పాలన..
గ్రామాల్లో అభివృద్ధి శూన్యం..
సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్
తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ పదవీ కాలం గత ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో, ప్రజలు మరియు అభ్యర్థులు ఈ ఎన్నికలు ఎప్పుడొస్తాయో అని ఎదురుచూస్తున్నారు, స్థానిక ఎన్నికల ప్రక్రియ సాధారణంగా పదవీ కాలం ముగిసే 3 నెలల ముందే ప్రారంభమవ్వాలి కాని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నా ప్రజలు మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ సమయంలో మాజీ సర్పంచ్‌లుగా మారిన వారు కూడా రోడ్డెక్కారు, స్థానిక ప్రజలకు అవసరమైన సేవలను చేయలేకపోతున్నారని తెలుస్తోంది.
గ్రామాల అభివృద్ధిపై ప్రభావం ఎంతగానో :
సర్పంచ్‌లు లేకపోవడంతో, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి గ్రామ అభివృద్ధి కోసం వచ్చే నిధులు ఆగిపోయి, అభివృద్ధి వ్యవస్థ స్తంభించిపోయింది, ఈ పరిస్థితి చాలా మంది ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది, గ్రామాలలో వుండే ప్రముఖులు మరియు గ్రామస్థులు ఈ నిధుల ఆగడాన్ని తీవ్రంగా పరిగణిస్తు గ్రామాల అభివృద్ధి వెనుకబడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులతో త్వరలో ఎన్నికలు పూర్తి కావాలని ఆశిస్తున్నా ప్రజలు “మన గ్రామం మన సర్పంచ్” అనే భావనతో ఉంటారు, ప్రతి సర్పంచ్ వారి గ్రామ సమస్యలను గ్రామస్థుల సమస్యలు పరిష్కరించగలుగుతారని వుండే అ నమ్మకం చాలా ముఖ్యమైనది, సర్పంచ్ ల పాలన లేక ప్రజలు చిన్న చిన్న సమస్యలకు సైతం స్థానిక సంబంధిత అధికారులను, పోలీస్ శాఖ వారిని ఆశ్రయించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతున్నా, అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన కొన్ని సంక్షేమ, మరియు తదితర పనులతో వారి శాఖ పరమైన సంభాదిత పనులలో నిమగ్నమై ఉంటూ గ్రామస్థులతో అందుబాటులో ఉన్నప్పటికీ ఎంతైనా అధికారిగానే భావిస్తున్నారు కానీ తమ సహాయకుడు అనే కోణంలో చూడలేకపోతున్నారు,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా ముందు ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే తరువాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రక్రియ 60 రోజుల్లో పూర్తవుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
కానీ గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఈ ఎన్నికల ప్రక్రియ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తు వారు సర్పంచ్ ఎన్నికల జరగడానికి అన్ని రకాలుగా దృష్టినీ ఉంచడంతో పాటు, నూతనంగా ఎన్నికయ్యే సర్పంచ్ తమ గ్రామ అభివృద్ధి మరియు వారి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు.