హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి
సతీష్ కుమార్ నివాసంలో ప్రత్యేక పూజలు
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ అక్టోబర్ 11:
హుస్నాబాద్ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఆకాంక్షించారు. గత మూడు రోజులుగా హనుమకొండ హంటర్ రోడ్డు లోని వారి నివాసంలో జరుగుతున్న అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని.. మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి కాంతారావు, కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని పూలమాలలతో సుందరంగా అలంకరించారు. శ్రీ సూక్త, దుర్గ సూక్త పఠనంతో.. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలకు అత్యంత ప్రాధాన్యత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా.. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని, జగన్మాతను కోరుకున్నట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు మహిళలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తాయని, అమ్మవారి శక్తిని గుర్తు చేస్తాయని అన్నారు. ప్రజలకు ఆయన దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.





