హుస్నాబాద్ పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక రెడ్డి కాలనీలోని సిద్ధార్థ స్కూల్ ప్రక్కన ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రామ్ నారాయణ మాట్లాడుతూ… పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 2021 నవంబర్ కన్నా ముందు ఉత్తీర్ణులైన పట్టభద్రులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటో, డిగ్రీ మెమో లేదా ప్రొవిజినల్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు సమర్పించి ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లు ఈ ఉచిత ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు చేయించుకుంటే భవిష్యత్తు లో ఎం ఎల్ సీ ఎన్నికల్లో మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఈ క్రింది మొబైల్ నెంబర్లను 7093212955, 8074373768, 9059789399 లను సంప్రదించాలని లేదా వాట్సాప్ ద్వారా వివరాలు పంపించినచో ఓటు నమోదు చేయబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ నారాయణ, కిరణ్, వెంకటేష్ గౌడ్, శ్రీధర్, రామ్ రెడ్డి, సంపత్, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





